e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఆదిలాబాద్ 9వ వార్డు కౌన్సిలర్ గా బీజేపీ అభ్యర్థి దుర్గ ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దుర్గ ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం దుర్గకు 739 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాటే మంగళకు 436 ఓట్లు లభించాయి. దీంతో దుర్గ 294 ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

9వ వార్డులో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. విజయం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు దుర్గకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని దుర్గ పేర్కొన్నారు.

వార్డులో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సమయానికి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 9వ వార్డు ఫలితం ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE