e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

45వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 45వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం అధికారులు ఫలితాన్ని ప్రకటించారు.

వివరాల ప్రకారం బండారి అనూషకు మొత్తం 721 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి సువిధకు 383 ఓట్లు లభించాయి. దీంతో 338 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో బండారి అనూష గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగినట్లు ఎన్నికల వర్గాలు వెల్లడించాయి.

ఫలితం ప్రకటించగానే అనూష అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని విజేత అభ్యర్థి తెలిపారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 45వ వార్డు ఫలితం ప్రత్యేకంగా నిలిచింది. స్వతంత్ర అభ్యర్థి విజయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మిగిలిన వార్డుల ఫలితాలపై కూడా ఆసక్తి కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE