e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు

మన భారత్ తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని రైతులు యాసంగి సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎకరానికి రూ.6,000 చొప్పున అందించే ఈ పథకం కింద నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నట్లు సమాచారం.

ప్రభుత్వం మొదట సాగులో ఉన్న భూములకే రైతు భరోసా అందించాలని భావించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ సర్వేతో లింకు చేయకుండా, ఖరీఫ్ సీజన్‌లో ఈ పథకం పొందిన రైతులందరికీ యాసంగి సీజన్‌లోనూ సాయం అందించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

దీంతో సుమారు 1.45 కోట్ల ఎకరాలకు నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.

మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16తో ముగియనుండగా, ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశముందని తెలుస్తోంది. రైతులకు ఆర్థికంగా ఊరటనిచ్చే ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందని భావిస్తున్నారు.

రైతు భరోసా పథకం అమలు వల్ల రైతుల సాగు ఖర్చులకు ఉపశమనం లభించడంతో పాటు, యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE