ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు
మన భారత్ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని రైతులు యాసంగి సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎకరానికి రూ.6,000 చొప్పున అందించే ఈ పథకం కింద నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం మొదట సాగులో ఉన్న భూములకే రైతు భరోసా అందించాలని భావించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ సర్వేతో లింకు చేయకుండా, ఖరీఫ్ సీజన్‌లో ఈ పథకం పొందిన రైతులందరికీ...