కారు లిఫ్ట్ ఇచ్చాడు.. కత్తి గుచ్చాడు

Published on

-Advertisement-

మన భారత్ నల్గొండ;

నల్గొండ జిల్లాలో మానవత్వాన్ని దుర్వినియోగం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరిన ఇమ్రాన్ అనే వ్యక్తి, మార్గమధ్యలో నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్నాడు.

అయితే చిట్యాల సమీపానికి చేరుకోగానే, ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఇమ్రాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఇమ్రాన్ మెడతో పాటు శరీరంపై విచక్షణ లేకుండా కత్తిపోట్లకు పాల్పడి, అతని సెల్‌ఫోన్ మరియు నగదు లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

తీవ్ర గాయాల మధ్య కూడా ఇమ్రాన్ ధైర్యంగా ప్రతిఘటించడంతో, భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇమ్రాన్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అతడిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైవేలపై లిఫ్ట్ ఇచ్చే విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this