e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ADBలోనే రికార్డు స్థాయి నామినేషన్స్.. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ వేడి 

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగింది. చివరి రోజు అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.

అధికారుల వివరాల ప్రకారం,

మొదటి రోజు 8 నామినేషన్లు

రెండో రోజు 141 నామినేషన్లు

మూడో రోజు ఒక్కరోజే 621 నామినేషన్లు

మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 770 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలలోనే కాదు, మంచిర్యాల కార్పొరేషన్‌కు దీటుగా ఆదిలాబాద్‌లో ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలపై ప్రజల్లో ఉన్న ఆసక్తి, రాజకీయ పార్టీల మధ్య పోటీ, స్వతంత్ర అభ్యర్థుల అధిక సంఖ్య ఈ రికార్డు స్థాయి నామినేషన్లకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అసలు రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టమవుతాయని తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE