సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల నూతన సర్పంచుల సంఘాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ కార్యవర్గాన్ని సమ్మతితో ఎంపిక చేశారు.

ఈ ఎన్నికల్లో కజ్జర్ల గ్రామానికి చెందిన సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డిని మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. తలమడుగు గ్రామానికి చెందిన ఎలుగు రాజన్నతో పాటు పూనగూడ గ్రామానికి చెందిన పెందూర్ హన్మంతులను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. పెద్ద పల్లి గ్రామానికి చెందిన కట్కం సంజీవ్ ను కోశాధికారిగా, రుయ్యాడి గ్రామానికి చెందిన ఉడుగు రాకేష్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే సకినాపూర్ గ్రామానికి చెందిన మెస్రం నిఖిత నగేష్ ను మహిళా ప్రధాన కార్యదర్శిగా, సుంకిడి గ్రామానికి చెందిన మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ ను ప్రచార కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘ నాయకులు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల మధ్య సమన్వయం పెంచి, స్థానిక స్వయంపాలన సంస్థల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this