గణతంత్ర దినోత్సవ వేడుకలో సర్పంచ్ సంతోష్

Published on

-Advertisement-

 మన భారత్ , తలమడుగు: మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

పంచాయితీ కార్యదర్శి బండి విజయ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలకు శోభను చేకూర్చారు. దేశ ఐక్యత, సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణపై ప్రసంగాలు జరిగాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించగా, గ్రామస్తులు జాతీయ గౌరవాన్ని చాటారు.

ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో, యువజన సంఘాల నాయకులు గణతంత్ర దినోత్సవంలో భాగంగా జెండాను ఆవిష్కరించారు. పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కని సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో దేవాపూర్ గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this