బంగారం ఆల్‌టైమ్ హై.. హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.1.52 లక్షలు

Published on

మన భారత్, హైదరాబాద్:
పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర 3 శాతం జీఎస్టీతో కలిపి ఏకంగా రూ.1,52,000ను దాటింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి, ఇవాళ ఒక్కసారిగా భారీ ఎగబాకి కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ ధరలు సామాన్యులపై భారంగా మారుతున్నాయి.

అటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టడం లేదు. హైదరాబాద్ మార్కెట్లో వెండి రిటైల్ ధర కిలోకు 3 శాతం జీఎస్టీతో కలిపి రూ.3,39,900 పైనే కొనసాగుతోంది. పరిశ్రమల అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు కూడా బలంగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ముందు రోజుల్లోనూ బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం కష్టమేనని, అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this