రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా బాధ్యత వహించాలని రూరల్ సీఐ ఫణిదర్ పేర్కొన్నారు. తాంసి నుంచి అంబుగామ గ్రామం వరకు సుమారు 5 కిలోమీటర్ల రహదారిపై మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ప్రమాదాలకు నెలవుగా మారాయి.

ఈ సమస్యను గుర్తించిన అంబుగామ గ్రామ సర్పంచ్ తూర్పా భాయి యశ్వంత్ ప్రజల భద్రత దృష్ట్యా రూ.20 వేల సొంత ఖర్చుతో జేసీబీ సహాయంతో ఆదివారం పిచ్చి మొక్కలను తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులు సీఐ ఫణిదర్ సమక్షంలో చేపట్టడంతో పాటు రహదారి పూర్తిగా దర్శనీయంగా మారి వాహన రాకపోకలు సులభతరమయ్యాయి.

ప్రజల ప్రాణాల రక్షణ కోసం ముందుకొచ్చిన సర్పంచ్ తూర్పా భాయి యశ్వంత్‌ను సీఐ ఫణిదర్ ప్రత్యేకంగా అభినందించారు. రహదారి భద్రత విషయంలో ఇలాంటి చర్యలు మరింత అవసరమని, ప్రమాదాల నివారణకు స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై జీవన్ రెడ్డి కూడా పాల్గొని, రహదారి భద్రతపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటించడం ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

Latest articles

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా...

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు:...

More like this