ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలం: ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి

Published on

-Advertisement-

మన భారత్ ,తెలంగాణ:

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయిందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ పాలనలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. రైతులకు వాస్తవంగా ఉపయోగపడేలా సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే సదర్మాట్ బ్యారేజీని పూర్తి చేసి రైతులకు అంకితం చేసిందని జూపల్లి తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.

అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రైతుల నష్టపరిహారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసి రైతులకు న్యాయం చేశారని చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, సాగునీరు, పరిహారం, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి రాజీ లేదని మంత్రి స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి భరోసా కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Latest articles

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ -బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను...

More like this