గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల ఊతం

Published on

-Advertisement-

సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల

మన భారత్ ,తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు, త్రాగునీరు, వీధిదీపాలు, రహదారుల మరమ్మతులు వంటి అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. పండుగ వేళ నిధుల విడుదలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకోనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ గ్రామ పంచాయతీలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు మంత్రి సీతక్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ స్వరాజ్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆమె పేర్కొన్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this