అటు ఇంటర్ పరీక్షలు.. ఇటు మున్సిపల్ ఎన్నికలు

Published on

-Advertisement-

పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడేనా?

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరిన ఇంటర్ బోర్డు

మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో, ఇప్పటికే ప్రారంభమైన ఇంటర్ పరీక్షల సీజన్‌పై ప్రభావం పడుతుందన్న ఆందోళన విద్యా వర్గాల్లో వ్యక్తమవుతోంది.

సంక్రాంతి సెలవులు ముగియగానే ఇంటర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనుండగా, 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన అనంతరం ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక (థియరీ) పరీక్షలు జరుగనున్నాయి.

పరీక్షలతో పాటు జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగనుంది. దాదాపు నెల రోజులపాటు మూల్యాంకనం జరగనుండటంతో, ఈ కీలక సమయంలో ఎన్నికల విధులు కూడా ఉంటే పరీక్షల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళన ఇంటర్ బోర్డు అధికారుల్లో వ్యక్తమవుతోంది.

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతూ లేఖ

ఇంటర్ పరీక్షల విధుల్లో పాల్గొనే లెక్చరర్లు, సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరుతూ ఇంటర్ బోర్డు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఇంటర్ పరీక్షల సిబ్బందికి అప్పగించవద్దని కోరింది.

ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ సెక్టార్ (గురుకుల) కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారని బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ కాలేజీల్లో 1,844 మంది బోధనేతరులు, 7,110 మంది బోధన సిబ్బంది, ప్రభుత్వ సెక్టార్ కాలేజీల్లో 759 మంది బోధనేతరులు, 12,131 మంది బోధన సిబ్బంది మొత్తం కలిపి సుమారు 21,844 మంది పరీక్షల విధుల్లో పాల్గొంటారని పేర్కొంది.

పరీక్షల సమయంలో సమన్వయం, పర్యవేక్షణ, ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ వంటి బాధ్యతలు లెక్చరర్లు, సిబ్బందిపై ఉంటాయని, వీరిని ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తేనే పరీక్షలు సజావుగా నిర్వహించగలమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

More like this

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....