మిత్రా సేవా సొసైటీ ఔదార్యం..

Published on

-Advertisement-

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ ఆర్థిక సహాయం

పశువుల కొట్టం దగ్ధం.. ఐదు గేదెలు సజీవ దహనం

– బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సంఘం

మన భారత్, బోరజ్:

భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఉశ్కమల్ల కృష్ణకు చెందిన పశువుల పాక (కొట్టం) పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశుగ్రాసం (సొప్ప, కుటారు), వ్యవసాయ పనిముట్లు, పైపులు తదితర సామగ్రితో పాటు ఐదు గేదెలు (బర్రెలు) సజీవ దహనమై మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.

ఈ విషయం తెలుసుకున్న మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ అధ్యక్షులు, తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తోట శివ్వన్న, మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్ కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు ఉశ్కమల్ల కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోధైర్యాన్ని కల్పించారు. బాధిత కుటుంబానికి తమవంతు సహాయంగా మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

సామాజిక బాధ్యతలో భాగంగా బాధితులకు అండగా నిలిచామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this