ధర్మ పరిరక్షణకు సత్యమేవ జయతే ఫౌండేషన్ పిలుపు

Published on

-Advertisement-
  • కుచులాపూర్‌లో గాయత్రీ యజ్ఞం సత్సంగ సమ్మేళనం

మన భారత్, తెలంగాణ: శ్రీ సత్యమేవ జయతే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాయత్రీ యజ్ఞం సత్సంగ సమ్మేళనం కుచులాపూర్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రీ మాత పల్లకి నామస్మరణ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.

ఈ కార్యక్రమానికి సత్యమేవ జయతే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నందన కృపాకర్, వలిశెట్టి లక్ష్మీ శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు రమేష్ ప్రకాష్‌తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, అమ్మగార్లు యజ్ఞంలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.

అనంతరం ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి ఇచ్చిన అమృత వచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశం, ధర్మం, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావిస్తూ, మతమార్పిడులు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వారి ప్రవచనాలు గ్రామస్తుల్లో దేశభక్తి, ధర్మ పరిరక్షణపై బలమైన విశ్వాసాన్ని నింపాయి.

ఈ సందర్భంగా కుచులాపూర్ గ్రామం తరఫున ఫౌండేషన్‌లో గోశాల కమిటీ, యువ కమిటీ, వానర కమిటీ, భజన కమిటీలను ఏర్పాటు చేసి, అందరూ ఒక తాటిపై కలిసి దేశం, ధర్మం కోసం సమిష్టిగా పని చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెరిక పొచ్చన్న, కొత్త మల్లేష్, ఆర్. రాములు, ఎం. వెంకన్న, ఆర్. దీపక్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest articles

12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం..

# వనమహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు  ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం  12,642 నర్సరీల్లో 15.61 కోట్ల...

ఆలయ వార్షికోత్సవం విజయవంతం చేయాలి..

పొన్నారి శ్రీ మహాలక్ష్మీ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నాజి నర్సింగ్...

జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రెసా సంఘం..

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ట్రెసా జిల్లా సంఘం రెండేళ్ల విజయవంతమైన సేవలను అభినందించిన ట్రెసా నాయకులు మన...

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో కొండా దంపతులపై అసత్య ప్రచారాన్ని మానుకోవాలి

తప్పుడు ప్రచారాలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: వేముల మహేందర్ గౌడ్ మన భారత్, మొగుళ్లపల్లి: ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కేటాయింపుల...

More like this