e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో కొండా దంపతులపై అసత్య ప్రచారాన్ని మానుకోవాలి

తప్పుడు ప్రచారాలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: వేముల మహేందర్ గౌడ్

మన భారత్, మొగుళ్లపల్లి:

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కేటాయింపుల పేరుతో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కొండా దంపతుల వీరాభిమాని వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలు మరియు వాట్సాప్ గ్రూపుల్లో కొందరు కావాలనే అసత్య కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాసేవను ధ్యేయంగా తీసుకుని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న కొండా దంపతులపై నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్న నాయకురాలని పేర్కొన్నారు. అలాగే కొండా మురళీ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.

ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల విషయంలో కొందరు మధ్యవర్తులు, దళారులు జోక్యం చేసుకుంటున్నారనే సమాచారం అందిన వెంటనే కొండా మురళీ స్పందించి కఠిన హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి అవినీతి లేకుండా అందాలని ఆయన ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని అన్నారు.

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కేటాయింపుల విషయంలో అవినీతి జరిగిందని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మహేందర్ గౌడ్ పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. నిర్ధారణ లేని ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం సరికాదని చెప్పారు.

గతంలో కొన్ని ఏజెన్సీలకు మాత్రమే అవకాశాలు కల్పించడంతో అనేక మంది నిరుద్యోగులు నష్టపోయారని, ప్రస్తుతం పారదర్శక విధానంలో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాల భర్తీ జరుగుతోందని తెలిపారు. ఉద్యోగ నియామకాలు, జీతాల చెల్లింపులు పారదర్శకంగా జరుగుతున్నాయని, ఈ విషయాన్ని నిరుద్యోగ యువత కూడా స్వాగతిస్తోందన్నారు.

కొండా దంపతుల నాయకత్వంలో చేపట్టిన చర్యల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు విస్తరించాయని, అవినీతికి తావు లేకుండా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకులపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు.

ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొనసాగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని కొండా దంపతుల నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, నిరుద్యోగ యువతకు అవకాశాల కల్పనలో కొండా దంపతులు చేస్తున్న కృషిని కొనియాడారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE