ఆర్టీసీలో పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

Published on

-Advertisement-

టీజీఎస్‌ఆర్టీసీలో 198 పోస్టులు..

– డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ

మన భారత్, తెలంగాణ:

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

టీజీఎస్‌ఆర్టీసీలో  84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులతో కలిపి మొత్తం 198 ఖాళీలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన వివరించారు.

ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30 ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు [www.tgprb.in](http://www.tgprb.in) వెబ్‌సైట్‌లో మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, వయోపరిమితి, ఫీజు వివరాలు తదితర పూర్తి సమాచారం అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా టీజీఎస్‌ఆర్టీసీ సేవలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

Latest articles

కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ...

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

More like this