e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

మన భారత్, తలమడుగు :
తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అనూహ్యంగా కరెంట్ నిలిచిపోవడం కొంతసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ నిర్వాహకులు బ్యాటరీ మైక్ సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని “మోదుగ మొగ్గలు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కరెంట్ నిలిచిపోవడంతో కొంతసేపు కార్యక్రమం అంతరాయం కలిగినప్పటికీ, నిర్వాహకులు చురుకుగా స్పందించి బ్యాటరీ మైక్ ద్వారా సభను కొనసాగించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నప్పటి నుంచే రచనా ప్రతిభను పెంపొందించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సృజనాత్మకతతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించవచ్చని సూచించారు.

తరువాత బండల్ నాగపూర్ మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది కలెక్టర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఉదారి నారాయణ, ఎంపీడీవో మోహన్ రెడ్డి, ఎమ్మార్వో లక్షీ, ఎంఈవో శ్రీకాంత్, ఎపీఎం భగవాండ్లు, సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ రాంరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE