ఐ-బొమ్మ రవి ప్రయత్నం ఫలించలేదు..

Published on

-Advertisement-

ఐ-బొమ్మ రవి ప్రయత్నం ఫలించలేదు… డేటా క్లియర్‌ చేసి, పరికరాలు దాచినా పోలీసులకు దొరికిపోయిన సాక్షాలు

మన భారత్, హైదరాబాద్: ఐ-బొమ్మ కేసులో నిందితుడు రవి అరెస్ట్ సందర్భంగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్ట్‌కు ముందు గంటన్నరపాటు తన ఇంటి తలుపులు తెరవకుండా రవి ఆలస్యం చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లోపులోగానే టెలిగ్రామ్ మరియు మొబైల్‌లోని ముఖ్యమైన డేటాను పూర్తిగా క్లియర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అంతేకాక, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి రవి తన ల్యాప్టాప్‌ను బాత్రూమ్ రూఫ్‌ కింద దాచగా, మొబైల్ ఫోన్‌ను అల్మారాలో దాచినట్టు విచారణలో తెలిసింది. అయితే ఈ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని, పరికరాలు పూర్తిగా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్టు అధికారులు తెలిపారు.

ప్రారంభ విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌ పేర్కొంది. అలాగే స్నేహితులు, బంధువులతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్టు కూడా అందులో నమోదు చేశారు. ఐ-బొమ్మ కేసులో రవి అరెస్ట్‌తో కీలక దశ మొదలైందని, మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు సూచించారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this