e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

జగిత్యాల బీట్ బజార్ మార్కెట్ తరలింపుపై సమావేశం..

జగిత్యాల బీట్ బజార్ మార్కెట్ తరలింపుపై
అడితిదారులతో ఎమ్మెల్యే సమావేశం
జగిత్యాల, నవంబర్ 29, అఖండదీపం :చల్గల్ వ్యవసాయ మార్కెట్‌ను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల బీట్ బజార్ అర్ధిదారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అర్ధిదారుల సంఘం ప్రతినిధులతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశమై బీట్ బజార్ మార్కెట్ అభివృద్ధి, తరలింపు అంశాలపై చర్చించారు. అర్ధిదారులు, వ్యాపారులు, రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాల బీట్ బజార్ మార్కెట్‌కు అధిక మొత్తంలో సన్నధాన్యం వస్తోందని, ప్రభుత్వ మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో ధాన్యం కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో స్థలాభావం ఏర్పడి రైతులు, వ్యాపారులు, అర్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో జగిత్యాల బీట్ బజార్ మార్కెట్‌ను చల్గల్ వ్యవసాయ మార్కెట్‌కు తరలించాలని, అక్కడ రైతులు, అర్ధిదారులు, వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే రైతుల ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఈ-నామ్ వ్యవస్థను చల్గల్ మార్కెట్‌లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ చల్గల్ వ్యవసాయ మార్కెట్‌ను విశాలంగా, అన్ని వర్గాలకు అనువుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్‌లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయించడంతో పాటు సీసీ ఫ్లాట్‌ఫామ్ నిర్మాణానికి కూడా కృషి చేస్తానని తెలిపారు.

డిసెంబర్ చివరి నాటికి బీట్ బజార్ మార్కెట్‌ను చల్గల్ మార్కెట్‌కు తరలించేలా అధికారులు సూచించగా, అర్ధిదారులు కొంత సమయం కావాలని కోరారు. అనంతరం డిసెంబర్ చివరి నాటికి తరలింపునకు అంగీకారం తెలిపారు. అదేవిధంగా జగిత్యాల బీట్ బజార్ ప్రస్తుత మార్కెట్ స్థలంలో సమీకృత వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేసి పట్టణ ప్రజలకు మరింత మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. చల్గల్ మార్కెట్‌లో రైతులు, అర్ధిదారులు, వ్యాపారులకు హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, సీనియర్ నాయకులు సమైండ్ల శ్రీనివాస్, అర్ధిదారుల సంఘం అధ్యక్షులు చిక్కుల భూమయ్య, అర్ధిదారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE