e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

కొండగట్టు ఆంజనేయ స్వామికి వేములవాడ దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పణ

కొండగట్టు ఆంజనేయ స్వామికి వేములవాడ దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పణ
జగిత్యాల/కొండగట్టు, నవంబర్ 28, మన భారత్ :
శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టులో చందనోత్సవాల సందర్భంగా స్వామివారి నిజస్వరూప దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రముఖ దేవస్థానాల నుంచి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ తరఫున దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీమతి రమాదేవి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం పట్టువస్త్రాలను పూర్ణకుంభ స్వాగతంతో స్వీకరించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మీ మార్గం ఆదిత్య, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, జగిత్యాల.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE