e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

భక్తిశ్రద్ధలతో వైభవంగా రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

భక్తిశ్రద్ధలతో వైభవంగా రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28,

ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, స్థానిక ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి.

ఈ ఉత్సవంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి పల్లకీని మోస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గురుస్వాములు ఎమ్మెల్యేకు సంప్రదాయబద్ధంగా శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రవీంద్రనగర్ అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం సంతోషకరమన్నారు. స్వామివారి పల్లకీ ఊరేగింపు ద్వారా ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఇంటింటికీ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతోందని పేర్కొన్నారు.

నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష చేపట్టి స్వామివారిని ఆరాధించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం

ఆరట్టు ఉత్సవంలో అయ్యప్ప భక్తులు భక్తి గీతాలు, స్వామివారి నామస్మరణతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక కాలనీవాసులు సైతం ఉత్సవంలో పాల్గొని స్వామివారి పల్లకీకి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, వార్డు కౌన్సిలర్ సూచిక మనోజ్, ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, రవీంద్రనగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నరూ.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE