e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

మన భారత్, జైనథ్:నవంబర్ 26,

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి చెందిన చౌదరి తులసిరాం ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తనవంతుగా ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ఎదురైన కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని భరోసా కల్పించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పేర్కొన్నారు.

కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పుండ్రు అశోక్ రెడ్డి, ఆశన్న యాదవ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE