e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ: జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్

రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ: జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26:

భారత రాజ్యాంగ పరిరక్షణకు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కట్టుబడి పనిచేస్తోందని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనువాద పార్టీలన్నీ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పటికీ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు నిరంతరం పోరాడుతున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.

భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, అణగారిన సమాజాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, జిల్లా కోశాధికారి నరసింహరాజు, ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు దుమ్మ శ్రీహరి, బోథ్ అసెంబ్లీ కార్యదర్శి వెంకటేష్, ముత్తన్న తదితర బహుజన సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE