e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు..

ఆదిలాబాద్‌లో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు

ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా – ఎమ్మెల్యే పాయల్ శంకర్

విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎస్పీ, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 15,

ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై వీరోచితంగా పోరాడిన భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హీరాసుఖా ఆదివాసీ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బిర్సా ముండా సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే డోలు వాయిదాల నడుమ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ ఉత్సాహంగా నృత్యం చేసి వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కార్యక్రమ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా కేవలం 25 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఆదివాసీ సమాజంలో చైతన్యం నింపిన గొప్ప యోధుడని కొనియాడారు. అతి చిన్న వయసులోనే సమాజం కోసం, తన ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

బిర్సా ముండా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి, సమాజానికి అందించిన సందేశం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అటవీ భూములు, జల్‌ (నీరు), జంగల్‌ (అడవి), జమీన్‌ (భూమి) హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం చేసిన కృషి చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.

మహనీయుల జీవిత చరిత్రలను యువత అధ్యయనం చేయాలని, వారి త్యాగాలు, పోరాటాలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ ఆదివాసీ ఐక్యత, హక్కులు, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలనే సందేశాన్ని నిర్వాహకులు చాటిచెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE