e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..

ఎల్లారెడ్డిపేటలో నార్కోటిక్ జాగిలంతో విస్తృత తనిఖీలు

విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్‌ఐ రమేష్‌ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 26, మన భారత్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర:

మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని కిరాణా దుకాణాలు, పాన్‌ షాపులు, పాఠశాల పరిసర ప్రాంతాలు, బస్టాండ్‌ ప్రాంతాల్లో సోమవారం నార్కోటిక్ జాగిలం సహాయంతో తనిఖీలు నిర్వహించారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి అక్రమ విక్రయాలపై తీసుకునే చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

విద్యాసంస్థల పరిసరాలపై ప్రత్యేక దృష్టి

యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలల పరిసరాలు, బస్టాండ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తామని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన

జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎల్లారెడ్డిపేట ఎస్‌ఐ రమేష్‌ గౌడ్ తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

యువత భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల సహకారంతోనే అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు సమాజంలో శాంతిభద్రతలను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు.

మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణం కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE