e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 22, 2026

మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు షురూ..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం.. పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పత్తి కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీడీఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ యార్డులోని కాంటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి పత్తి కొనుగోళ్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చిన రైతులతో అధికారులు మాట్లాడి కొనుగోలు ప్రక్రియ, నాణ్యత, తేమ శాతం పరీక్షలపై వివరాలు తెలుసుకున్నారు.

జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు, 18 కొనుగోలు కేంద్రాలు

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల కోసం జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు, 18 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,669గా ఉందని, ప్రస్తుతం జిల్లాలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ పత్తికి రూ.9,260 వరకు ధర చెల్లిస్తున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌లో పత్తికి అధిక ధర లభించడం రైతులకు ప్రయోజనకరమైన అంశమని కలెక్టర్ పేర్కొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని యంత్రాల ద్వారా పరీక్షించే విధానంపై సీసీఐ, మార్కెటింగ్ శాఖల సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

తేమ శాతం పరీక్షలో పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రైతులకు మార్కెట్‌లో అవసరమైన సౌకర్యాలు

ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీరు, విశ్రాంతి, భోజనం తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

ప్రారంభ రోజు మార్కెట్ యార్డులో పత్తికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,260 ధర లభించిందని, మార్కెట్ చరిత్రలో ముహూర్తం రోజున నమోదైన అత్యధిక ధర ఇదేనని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పత్తిని ఆలస్యం చేయకుండా మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. పత్తిలో తేమ శాతం పెరగడం, నాణ్యత దెబ్బతినడం వంటి కారణాలతో ధరపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున పత్తిని నాణ్యమైన స్థితిలో మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు.

దళారులను ఆశ్రయించకుండా మార్కెట్‌కు రావాలి

రైతులు దళారుల ద్వారా పత్తిని విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. తేమ శాతాన్ని యంత్రాల ద్వారా పరిశీలించి, పత్తి నాణ్యత ఆధారంగా నిబంధనల మేరకు కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధర అందేలా మార్కెట్ అధికారులు, సీసీఐ సిబ్బంది, కొనుగోలుదారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. రైతులు మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే సమయంలో అవసరమైన పత్రాలు, నాణ్యమైన పత్తిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి, డీఎంవో గజానంద్, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విట్టల్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కమిషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, మార్కెట్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE