e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 21, 2026

తెలంగాణ రక్షణ సేనలోకి బీఆర్ఎస్ నాయకుల చేరిక

సిరికొండలో తెలంగాణ రక్షణ సేనలోకి పలువురు బీఆర్ఎస్ నాయకుల చేరిక

రాంజీగూడకు చెందిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం
సిరికొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా సిడాం గణేష్ నియామకం

మన భారత్, సిరికొండ: అక్టోబర్ 21,

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని సిరికొండ మండలంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. మండలంలోని రాంజీగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించి నూతన నియామకాన్ని కూడా ప్రకటించారు.

రాంజీగూడకు చెందిన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

సిరికొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా సిడాం గణేష్

తెలంగాణ రక్షణ సేన పార్టీ సిరికొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా సిడాం గణేష్‌ను నియమిస్తూ రాథోడ్ బాపురావు బాధ్యతలు అప్పగించారు. గిరిజన ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తరించాలని సూచించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సిడాం గణేష్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గిరిజనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

పార్టీ బలోపేతానికి కృషి

సిరికొండ మండలంలో జరిగిన ఈ చేరికలు, నియామక కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సతీష్, సనా హుళ్ల సీతారాం, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE