e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 21, 2026

ఘనంగా ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు

తలమడుగులో ఘనంగా ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు

ఆయేషా గార్డెన్‌లో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎంపీ

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 21,

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ జన్మదిన వేడుకలను తలమడుగు మండలంలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయేషా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తన వెంట నడిచిన కార్యకర్తలు, అభిమానులే తనకు ప్రధాన బలమని అన్నారు. ప్రజలు, కార్యకర్తలు చూపిస్తున్న అభిమానం తనకు మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షలు

ఎంపీ గోడం నగేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఆయేషా గార్డెన్‌కు చేరుకున్నారు. ఎంపీని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహాసిని రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు, తాంసి మాజీ జడ్పీటీసీ తాటిపల్లి గంగాధర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి జి.వి. రమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి వాగ్మారే శైలేందర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమన్ జాదవ్ పాల్గొన్నారు.

అలాగే జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని ఎంపీ గోడం నగేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల సందడి, శుభాకాంక్షల మధ్య జన్మదిన వేడుకలు కొనసాగాయి.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE