e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 21, 2026

బీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్‌లోకి చేరికలు

బీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్‌లోకి చేరికలు

ధరంపూరికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం

మన భారత్, ఇచ్చోడ: అక్టోబర్ 21, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. ఆదిలాబాద్ టైలర్స్ కాలనీలోని బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి.

తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై పార్టీ కార్యకలాపాలపై చర్చించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ధరంపూరి గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా మండలంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ షేక్ భిలాల్ బాయ్, మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీలో నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE