e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 19, 2026

దుర్గామాత పూజలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మావలలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్

మన భారత్, మావల: అక్టోబర్ 19, మావలలోని నవశక్తి దుర్గ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. భక్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

దుర్గామాత మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బోరంచు గంగారెడ్డి, బోరంచు రచన రెడ్డి, బోరంచు చందన రెడ్డి, బోరంచు నికితా రెడ్డి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపం వద్ద భక్తి వాతావరణం నెలకొంది.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE