e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా..

భీంపూర్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, భీంపూర్: అక్టోబర్ 17, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను శనివారం భీంపూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేస్తూ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తగ్గించేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు దోహదపడుతున్నాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతోందని పేర్కొన్నారు. పథకాల అమలులో అర్హత, నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో భీంపూర్ సర్పంచ్ జాదవ్ రంజన రవీందర్, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ తన్వీర్ పాటిల్, భీంపూర్ మండల అధ్యక్షుడు సుదర్శన్, తలమడుగు మండల అధ్యక్షుడు సంతోష్, రమేష్, అను పటేల్, అశోక్, యువరాజ్, భీంపూర్ ఉప సర్పంచ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంతో మండలంలోని అర్హులైన కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందినట్లు నిర్వాహకులు తెలిపారూ.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE