e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

అక్టోబర్ 21 వరకు ఇసుక రవాణా నిలిపివేత: ఎస్‌ఐ ఎం. సురేష్

దసరా సద్దుల బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

-అక్టోబర్ 21 వరకు ఇసుక రవాణా నిలిపివేత: ఎస్‌ఐ ఎం. సురేష్

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 17, (మన భారత్):

మొగుళ్లపల్లి మండల ప్రజలందరికీ మొగుళ్లపల్లి ఎస్‌ఐ ఎం. సురేష్ సద్దుల బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిబంధనలను ఉల్లంఘించి రెచ్చగొట్టే పాటలు ప్లే చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా, దసరా పండుగను పురస్కరించుకొని ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు అక్టోబర్ 21వ తేదీ వరకు ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎస్‌ఐ ఎం. సురేష్ తెలిపారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేసినా, అనుమతులు లేకుండా ఇసుక తరలించినా సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, ఇసుక వ్యాపారులు పోలీసులకు , సంబంధిత అధికారులకు సహకరించాలని కోరారు.పండుగల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరిస్తూ దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను సంతోషంగా, సురక్షితంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఎస్‌ఐ ఎం. సురేష్ కోరారు.

Cell Number : cell_number : 9160189521

User Name : user_name : పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE