e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు..

తలమద్రి గ్రామం నుంచి టీఆర్ఎస్‌లో పలువురి చేరిక

కవితక్క సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రాథోడ్ బాపురావు వెల్లడి

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామస్తులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు, అధినేత్రి కల్వకుంట్ల కవితక్క ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామస్తులకు రాథోడ్ బాపురావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలు, స్థానిక అవసరాలను పార్టీ దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE