e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం

వార్డు నంబర్‌ 22లో లబ్ధిదారుల ఇంటికి భూమిపూజ

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 15,

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్‌ 22లో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు జహీరా బేగం–హమీద్ ఖాన్ దంపతుల నూతన ఇంటి నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి పాల్గొని భూమిపూజ నిర్వహించారు.

భూమిపూజ అనంతరం లబ్ధిదారులైన జహీరా బేగం, హమీద్ ఖాన్ దంపతులను వారు అభినందించారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం కుటుంబానికి ఆనందకరమైన విషయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులతో పాటు మాజీ కౌన్సిలర్లు అంబకంటి అశోక్, మన్సూర్ ఖాన్, అలీమ్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని నూతన ఇంటి నిర్మాణానికి శుభాకాంక్షలు తెలిపారూ.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE