e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నవాబుపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

మన భారత్ చిట్యాల: మండలం నవాబుపేట గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ చిట్యాల మండల నాయకులు నేరెళ్ల రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ 40 సంవత్సరాలు ఈ మనువాద వ్యవస్థపై పోరాటం చేసి భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సమస్త హక్కులను కల్పించి ఈ సమాజంలో గుర్తింపుని ఇవ్వడం జరిగింది. కనీసం మనిషిగా గుర్తింపు లేనటువంటి ఈ సమాజంలో ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా మనం మనుషులుగా గుర్తించబడుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం న్యాయం అనే విలువలతోటి జీవించాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. అంతేకాకుండా ఈ రాజ్యంలో సంపదలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని వర్గాల ప్రజలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కావాలని అన్నాడు.ఈ విధంగా అంబేద్కర్ గారి ఆలోచన గ్రామ గ్రామాన పునర్జీవింపజేసే కార్యక్రమంలో భాగంగానే నవాబుపేట గ్రామ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో దేవునూరి మనోహర్, వలబోజు నరేష్, మేడిపల్లి రవి మేడిపల్లి కరుణాకర్ దానవేని పవన్ MD అబ్బాస్ ఇరావేణి సాంబయ్య బొమ్మ సతీష్ కరోబార్ కాసగోని మల్లయ్య పర్ల పెల్లి కుమార్ కృష్ణ బొడ్డుపాల్ చరణ్ చిలుముల శ్యామ్ వాసాల విజయ్ చిలుముల సాయి జీడి సురేష్ చిరాజు సురేష్ రాములు నేరెళ్ల ప్రశాంత్ సంపంగి శ్రీను శివరాత్రి పోచయ్య డాక్టర్ బిక్షపతి తిప్పని రవి భద్రయ్య సాదయ్య పూలమ్మ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక

user5442714
user5442714
I am a passionate writer and digital marketing enthusiast with years of experience in content creation, SEO, and online publishing. I enjoy exploring topics related to technology, travel, health, and lifestyle. My goal is to share valuable insights and connect with readers around the world. Feel free to visit my website for more articles and resources: https://www.google.com.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE