e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..

రిమ్స్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి

రిమ్స్‌లో భద్రతా లోపాలు, వైద్య సేవలపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఎమ్మార్పీఎస్

మన భారత్, సెప్టెంబర్ 22, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నారుల విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన పసికందుల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కోరింది.

రిమ్స్‌ను సందర్శించిన ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, డీవీఎంసీ సభ్యుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ.. చిన్నారుల విభాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు పసికందులు మృతి చెందడం, పలువురు చిన్నారులు ప్రమాదంలో చిక్కుకోవడం అత్యంత బాధాకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

చిన్నారుల మృతితో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయని మల్లేష్ మాదిగ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు అవసరమైన అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

రిమ్స్‌లో సిబ్బంది, వైద్య సేవలపై దృష్టి పెట్టాలి

పేద ప్రజలకు ప్రధాన వైద్య ఆధారంగా ఉన్న రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ, క్రిటికల్ కేర్ వంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మరోవైపు అవసరమైన స్థాయిలో సిబ్బంది నియామకాలు, వైద్య సదుపాయాల విషయంలో సమస్యలు ఉన్నాయని మల్లేష్ మాదిగ ఆరోపించారు.

రిమ్స్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నట్లు తేలితే సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్‌లోని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, భద్రతా వ్యవస్థల్లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన

రిమ్స్ ఆసుపత్రిలోని సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మల్లేష్ మాదిగ హెచ్చరించారు.

రిమ్స్‌లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించే వ్యవస్థ, విద్యుత్ భద్రత, వైద్య సిబ్బంది అందుబాటు వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇండ్ల ఎల్లన్న మాదిగ, రోడ్డ గంగన్న, తరుడి శంకర్, సలీం తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE