మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ
మన భారత్,మొగుళ్ళపల్లి:
శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ యువజన సంఘం యూత్ అధ్యక్షుడు చిలువేరి పున్నంచందర్ ఆధ్వర్యంలో విగ్రహ దాతగా గుడిమల్ల రమేష్ ,ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుడి సన్నిధి వద్ద పూజ కార్యక్రమం,అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహా అన్న ప్రసాద దాతలు సామల దివ్య తిరుపతిరెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. విఘ్నేశ్వరుడి సన్నిది భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అన్నప్రసాద వితరణ నిర్వహించిన దాత సామల దివ్య -తిరుపతి ముదిరాజ్ యూత్ సభ్యులను భక్తులు అభినందించారు. నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ప్రారంభం కొనసాగాలని గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నడిగోటి రాము,తదితరులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
