మన భారత్, సెప్టెంబర్ 10 ఆదిలాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె విగ్రహానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్ ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నాయకులు అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం ప్రజా సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, గుర్రాల ఆశన్న, రజక సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
