మొగుళ్ళపల్లి లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మన భారత్,మొగుళ్ళపల్లి:
దేశ సేవకు జీవితాన్ని ధారపోసి భరతమాత ఒడిలో తుది శ్వాస వదిలిన దివంగత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం మొగులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, ఉప సర్పంచ్ల మండల పో రం అధ్యక్షులు నీల రాజు,టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, ఏలేటి శివారెడ్డి, ఎర్రబెల్లి కోటేశ్వరరావు, చాట్ల రవీందర్, జనార్ధన్ ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
