e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

రహదారి గుంతలమయం.. నిత్యం నరకయాతన

మన భారత్ | తలమడుగు

ఝరి–బరంపూర్ రహదారి గుంతలమయం..

నిత్యం నరకయాతన పడుతున్న ప్రయాణికులు

వర్షాలతో దెబ్బతిన్న రోడ్డుతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..

వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి

తలమడుగు, జూలై 27 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామం నుంచి బరంపూర్ వరకు ఉన్న ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

ఝరి నుంచి ఆదిలాబాద్‌కు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, వైద్య అవసరాల కోసం ప్రతిరోజూ ప్రయాణించే ప్రజలు ఈ రహదారి దుస్థితి కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రోడ్డు పరిస్థితి అంచనా వేయడం కష్టమవుతుండటంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోందని, గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, చిన్నపిల్లలు, వృద్ధులను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తుడు ఝరి సంతోష్ మాట్లాడుతూ, “ఝరి–బరంపూర్ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ ఈ సమస్యను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.

స్థానికులు కూడా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని, ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE