ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు జాబితా అవసరం..

Published on

-Advertisement-

SIR ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని పిలుపు – ప్రజాస్వామ్య బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అవసరమని వ్యాఖ్య

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు తమ వ్యక్తిగత వివరాలను పరిశీలించి అవసరమైతే సవరణలు చేయించుకోవాలని సూచించారు.

భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరు నమోదుకు ముందుకు రావాలని, చిరునామా మార్పు, పేరు, వయస్సు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సూచించారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, స్వచ్ఛమైన ఎన్నికల నిర్వహణకు సరైన ఓటరు జాబితా ఎంతో అవసరమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, గ్రామ కార్యదర్శి రాందాస్, బీజేపీ యువ మోర్చా తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ కిరణ్, శానం శ్రీనివాస్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఎల్ఓలు (BLOs), బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...