కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Published on

-Advertisement-

మొగుళ్లపల్లి మండలంలో 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో 26 మంది లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, రైతు బీమా, రైతు బోనస్, మహాలక్ష్మి పథకం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తోందని పేర్కొన్నారు.అలాగే విద్య, వైద్యం మీద ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి మండల తహసీల్దార్, పీఏసీఎస్ చైర్మన్, చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్, స్థానిక సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this