పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

Published on

-Advertisement-

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తాం

పోతుగల్లు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు

ఊరి బాగు కోసం యాటతో గ్రామ దేవతలకు మొక్కులు

గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతిని శాలువాతో ఘనంగా సత్కరించిన ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు తోడుగా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, ఆదివారం ఊరి కోసం యాట పోతుతో గ్రామ దేవతలకు మొక్కులను సమర్పించుకున్న ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపు తిరుమలేష్, ఉపాధ్యక్షుడు పచ్చిమట్ల కుమారస్వామి, కోశాధికారి రజనీకాంత్, ట్రాక్టర్ అసోసియేషన్ మెంబర్లు దారా ఓదెలు, గండ్ర లింగారావులు మాట్లాడారు. ఉన్నత చదువులను చదివిన సర్పంచ్ ఎలిగేటి తిరుపతి జాతీయ భావాలు కలిగిన భారతీయ జనతా పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందినప్పటి నుండి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఆయనకు చేదోడు, వాదోడుగా ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సర్పంచ్ ఎలిగేటి తిరుపతి మాట్లాడుతూ..గ్రామ పెద్దల సహకారంతో..ప్రజల దీవెనలతో గ్రామాన్ని సుందరీకరణ చేస్తానని తెలిపారు. ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సర్పంచ్ తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. తనను సన్మానించడం గ్రామ అభివృద్ధిలో మరింత బాధ్యత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీరు మన భారత్ లో రిపోర్టర్ గా పనిచేయాలంటే  మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this