కిషోరీ బాలబాలికలకు అవగాహన సదస్సు..

Published on

-Advertisement-

బాల్య వివాహాల నివారణ

టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదాలపై అవగాహన

మన భారత్, విజయనగరం:
దత్తిరాజేరు మండలం పరిధిలోని ఇంగిలాపల్లి గ్రామంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరీ బాలబాలికలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సాధికారిత అధికారిణి కె.వి. బాలమని ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మిషన్ శక్తి, మిషన్ వత్సల్య, వన్ స్టాప్ సెంటర్ సేవలు, బాలల హక్కులు, రక్షణ చట్టాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ప్రమాదాలు, బాల్య వివాహాల నివారణ వంటి పలు ముఖ్యమైన అంశాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

బాల్య వివాహాలు సమాజానికి హానికరమని, తక్కువ వయసులో వివాహాలు జరగడం వల్ల బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు. టీనేజ్ వయసులో గర్భధారణ కారణంగా తల్లి, శిశువు ఆరోగ్యానికి ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించి బాల్య వివాహాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా సంబంధిత అధికారులను లేదా హెల్ప్‌లైన్ సేవలను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ బాలికల భద్రత, విద్య, ఆరోగ్య పరిరక్షణలో సమాజం కీలక పాత్ర పోషించాలని అన్నారు. బాల్య వివాహాల నివారణకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో శకుంతల, సాయి విజయలక్ష్మి, లక్ష్మి, సరస్వతి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కార్యకర్తలు, కిషోరీ బాలబాలికలు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బాలికల్లో చైతన్యం పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this