పెళ్లి ముందు విషాదం… ప్రమాదంలో తండ్రి మృతి

Published on

-Advertisement-

మన భారత్ తలమడుగు (తాంసి):

పెళ్లి సందడి నడుమ విషాదం చోటుచేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో కలకలం రేపింది. కూతురు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన తండ్రి, తిరిగి శవంగా ఇంటికి చేరడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

గ్రామస్తుల వివరాల ప్రకారం గిరిగామకు చెందిన ఆది జ్ఞానేశ్వర్ (43) తన కుమార్తె అశ్విని పెళ్లి మే 4న జరగాల్సి ఉండగా, ఆదివారం బంధువుల ఇంటికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బోరిగామ సమీపంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే జ్ఞానేశ్వర్ మృతి చెందినట్లు సమాచారం. అదే ప్రమాదంలో ఆయనతో పాటు ఉన్న అమృత్‌కు కూడా గాయాలు కావడంతో తొలుత రిమ్స్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు.

మృతుడికి భార్య అనిత, కుమార్తె అశ్విని, కుమారుడు సిద్దు ఉన్నారు. పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన కుటుంబానికి ఈ ఘటన తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆనందంగా జరగాల్సిన పెళ్లి వేడుక, ఒక్కసారిగా విషాదంగా మారడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...

CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ

పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టిన ఆదిలాబాద్ పోలీసులు రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత.....

More like this