పాటలు తప్ప స్కామ్‌లు తెలియవు.!

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:
తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ గాయని Mangli తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనకు పాటలు తప్ప ఇతర విషయాలు తెలియవని, ఎలాంటి స్కామ్‌లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన మంగ్లీ, తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, డబ్బు విలువ బాగా తెలుసునని పేర్కొన్నారు. గత నెల రోజులుగా తనపై వచ్చిన ఆరోపణల కారణంగా కార్యక్రమాలు, రికార్డింగ్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

“విచారణ జరగాలి.. నేను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. బాధితులుగా చెప్పుకునే వారికి నేను అండగా ఉంటా” అని మంగ్లీ పేర్కొన్నారు. అలాగే మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావు లపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఇక మంగ్లీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ కీలక ఆరోపణలు చేశారు. “నేరగాళ్లే బాధితులుగా నటిస్తూ పోలీస్ స్టేషన్‌కి వస్తున్నారు. అసలు స్కామ్‌కు కారణమైన వారే మీడియా ముందుకు వచ్చి తమను బాధితులుగా చూపిస్తున్నారు” అని అన్నారు. “సుభాక్షేత్ర బిజినెస్” పేరుతో సంస్థ ఏర్పాటు చేసి, అందులో మధు ఎండీగా, హిమాకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం సంగీత రంగంతో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు పురోగతిపై అందరి దృష్టి నెలకొంది.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this