కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగిద్దాం..

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

భారత కార్మిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ బి.టి. రణదివె (BTR) 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు గోవిందరాజ్, జిల్లా కార్యదర్శి బండమీది బలరామ్ పాల్గొని బి.టి. రణదివె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ బి.టి. రణదివె గారు కేవలం నాయకుడే కాకుండా కార్మిక వర్గానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. దేశంలో కార్మిక హక్కుల సాధన కోసం, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించిన వారు, 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను తిప్పికొట్టడమే బి.టి. రణదివె గారికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.

బి.టి.ఆర్ పిలుపునిచ్చిన “ఐక్యత – పోరాటం” నినాదంతో కార్మిక వర్గం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జోషి, జిల్లా కమిటీ సభ్యులు కాశీనాథ్, నరహరి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...