కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగిద్దాం..
మన భారత్, నారాయణపేట: భారత కార్మిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ బి.టి. రణదివె (BTR) 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు గోవిందరాజ్, జిల్లా కార్యదర్శి బండమీది బలరామ్ పాల్గొని బి.టి. రణదివె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ బి.టి. రణదివె...