సామాన్యుల నిధుల దుర్వినియోగం..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు: 

ఆదిలాబాద్ జిల్లాలో తపాలా శాఖకు చెందిన నిధుల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం తన విధుల్లో ఉండగా రూ.2,12,033/- మొత్తాన్ని అక్రమంగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనపై పోస్టల్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.

దర్యాప్తు అనంతరం నిందితుడిని ఆదిలాబాద్ రూరల్ సీఐ కే. ఫణిధర్ ఆధ్వర్యంలో న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో తలమడుగు ఎస్సై డి. రాధిక కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

More like this